ఫోక్స్ వ్యాగన్ కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి బొత్స
- రూ. 11 కోట్ల ఫోక్స్ వ్యాగన్ కుంభకోణం
- సాక్షిగా కోర్టుకు హాజరైన బొత్స
- ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించిన సీబీఐ
కేసు వివరాల్లోకి వెళ్తే, రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో విశాఖలో కార్ల ఫ్యాక్టరీ స్థాపన కోసం ఫోక్స్ వ్యాగన్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్ కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే, తమకు వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్ తో ఎలాంటి సంబంధం లేదని ఫోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఈ అంశంలో అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై ఆరోపణలు వచ్చాయి. అనంతరం కేసును సీబీఐకి రాజశేఖరరెడ్డి అప్పగించారు. 2005లో కేసు నమోదు చేసిన సీబీఐ... ఇప్పటి వరకు 59 మంది సాక్షులను విచారించింది. 3 వేల పేజీలతో చార్జ్ షీట్ దాఖలు చేసింది.