సమ్మెబాట పట్టిన తెలంగాణ బొగ్గుగనుల కార్మికులు... నిలిచిన ఉత్పత్తి!
- జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు నిర్ణయం
- పలుచోట్ల గనుల్లో నిలిచిన ఉత్పత్తి
- భద్రాద్రి కొత్తగూడెంలో పూర్తి ప్రభావం
బొగ్గు గనుల్లోకి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు పోరాడుతున్న విషయం తెలిసిందే. జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా రామగుండం ఆర్బీ 1, 2, 3 రీజియన్లోని ఏడుగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే మందమర్రిలోని భూగర్భ, ఉపరితల గనుల్లో కార్మికులు కూడా సమ్మె బాటపట్టారు.