అమెరికాతో కలిసి నడిచి పాక్ తప్పుచేసింది!: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ అంతర్మథనం
- సీఎఫ్ఆర్ మేధోవర్గం సదస్సులో వ్యాఖ్యలు
- 9/11 దాడుల తర్వాత తటస్థంగా ఉండాల్సింది
- అగ్రరాజ్యంతో చేతులు కలపకుండా ఉంటే బాగుండేది
అమెరికాలాంటి అగ్రరాజ్యం ఈ దాడులతో చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పాకిస్థాన్ సైనిక స్థావరాల సమీపంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను 2011, మే 2వ తేదీన అమెరికా దళాలు అర్ధరాత్రి దాడిచేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ సైన్యానికి తెలిసే ఇదంతా జరిగిందన్నది అప్పటి చర్చ. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ 9/11 తర్వాత సంఘటనలపై ఇప్పుడు వాపోవడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాదంపై పోరుకోసం అమెరికాతో చేతులు కలపకుండా తటస్థంగా ఉండాల్సిందని, చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఇమ్రాన్ వాపోయారు. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.