కరకట్టపై అక్రమ నిర్మాణాలు.. పాతూరు కోటేశ్వరరావు నిర్మాణం కూల్చివేత
- కృష్ణానది కరకట్టపై 24 అక్రమ నిర్మాణాల గుర్తింపు
- సీఆర్డీఏ నోటీసులు జారీ
- సహేతుకంగా లేని వివరణలు ఐదు
కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై కఠిన చర్యలు చేపడతామని సీఆర్డీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కృష్ణానది కరకట్టపై 24 అక్రమ నిర్మాణాలను ప్రాథమికంగా గుర్తించారు. ఆయా నిర్మాణాల యజమానులకు సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అందులో, ఐదు భవనాలకు చెందిన యజమానులు ఇచ్చిన వివరణలు సహేతుకంగా లేకపోవడంతో చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.