10 కాదు... 11... మారనున్న ఫోన్ నంబర్ అంకెలు!
- 10 అంకెలతో 250 కోట్ల మందికే సేవలు
- 2050 నాటి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు
- ఓ అంకెను పెంచాలని భావిస్తున్న ట్రాయ్
ఇప్పటికే భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) 11 అంకెలను తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అతి త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. మరో 30 సంవత్సరాల తరువాత ఏర్పడే డిమాండ్ కు అనుగుణంగా ఓ అంకెను పెంచాలన్న నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.