అనారోగ్యంతో మృతి చెందిన తల్లి మేక.. దాని పిల్లలకు పాలిచ్చి ఆకలి తీరుస్తున్న శునకం
- ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో ఘటన
- పది రోజులుగా రెండు పూటలా పాలిస్తున్న శునకం
- చూసేందుకు తరలివస్తున్న జనం
గ్రామానికి చెందిన కొండయ్య అనే మేకల కాపరికి చెందిన మేక ఇటీవల రెండు పిల్లలకు జన్మనిచ్చింది. అనారోగ్యం బారినపడిన తల్లిమేక పది రోజుల క్రితం మృతి చెందింది. దీంతో పాలు లేక పిల్లలు విలవిల్లాడాయి. అయితే, ఈ విషయం మేకలకు కాపలా ఉండే శునకం ఎలా గ్రహించిందో.. వాటి వద్దకు వెళ్లి తన పొదుగును అందించింది. అంతే.. అవి ఆవురావురుమంటూ పాలను తాగి కడుపు నింపుకున్నాయి. గత పది రోజులుగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ్లలో ఆ శునకం మేక పిల్లలకు పాలిస్తోందని కొండయ్య తెలిపాడు.