Harish Shankar: సెట్లో వరుణ్ తేజ్ ను చూస్తే ఆశ్చర్యపోతారు: దర్శకుడు హరీశ్ శంకర్

  • నిన్న విడుదలైన 'గద్దలకొండ గణేశ్'
  • వరుణ్ తేజ్ కి అంకితభావం ఎక్కువ
  • సెట్లోకి రాగానే ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడన్న హరీశ్
హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'గద్దలకొండ గణేశ్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ వరుణ్ తేజ్ గురించి ప్రస్తావించాడు. "ఈ సినిమా వలన నేను వరుణ్ తేజ్ ను చాలా దగ్గరగా చూశాను. ఆయన చాలా అంకితభావం కలిగిన హీరో.

ప్రతి రోజు సెట్ కి రాగానే వరుణ్ తేజ్ ముందుగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తాడు. సీన్ పేపర్ పట్టుకుని చిన్నపిల్లాడు ఒక పాఠం నేర్చుకున్నట్టుగా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఆ సమయంలో ఆయన ఎవరితోనూ మాట్లాడడు .. పూజా హెగ్డేతో కూడా మాట్లాడడు. సీన్ సరిగ్గా చేయలేదనిపిస్తే ఆయనే ఒన్ మోర్ చెబుతాడు. ఎన్ని టేకులైనా పూర్తి సంతృప్తి కలిగే వరకూ చేస్తూనే ఉంటాడు. ఇతర పాత్రల తీరు తెన్నులను తెలుసుకోవడం ఆయనలోని మరో మంచి లక్షణం" అని చెప్పుకొచ్చాడు.
Harish Shankar
Varun Tej

More Telugu News