Mohan Lal: తన ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలు కలిగివున్నారంటూ మోహన్ లాల్ పై కేసు

  • ఏడేళ్ల కిందట ఏనుగు దంతాలు కొనుగోలు చేసిన మోహన్ లాల్
  • తాజాగా చార్జిషీట్ నమోదు చేసిన అటవీశాఖ
  • ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. ఏడేళ్ల క్రితం ఆయన కొన్ని ఏనుగు దంతాలను అక్రమంగా కొనుగోలు చేయగా, తాజాగా కేరళ అటవీశాఖ చార్జిషీట్ నమోదు చేసింది. ఏనుగు దంతాలను కలిగివుండడం అక్రమమని పేర్కొంది. ఏనుగు దంతాలను కలిగివుండడంపై చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ (సీడబ్ల్యూడబ్ల్యూ)కి సమాచారం అందించడంలో విఫలమయ్యారంటూ మోహన్ లాల్ పై అభియోగాలు మోపారు. కేరళ అటవీశాఖ చట్టాల ప్రకారం ఇలాంటి కేసుల్లో భారీ జరిమానాతో పాటు ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.
Mohan Lal
Kerala
Ivory

More Telugu News