Tollywood: ప్రభుత్వమే సినిమా టికెట్లను అమ్మే ఆలోచన చేస్తున్నాం: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
  • ఆన్ లైన్లో టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి 
  • ప్రభుత్వం టికెట్లు అమ్మితే అందరికీ లాభం ఉంటుంది 
సినిమా టికెట్ల విక్రయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆన్ లైన్లో టికెట్లు విక్రయించే విధానానికి స్వస్తి చెప్పబోతున్నట్టు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వమే టికెట్లను అమ్మే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం టికెట్లను అమ్మడం వలన అందరికీ లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
Tollywood
Cinema Tickets
Online Booking
Talasani

More Telugu News