చిరంజీవి 'సైరా' ట్రైలర్ పై అమీర్ ఖాన్ స్పందన!

  • 'సైరా' ట్రైలర్ చూశా
  • అద్భుతంగా ఉంది
  • సినిమా చూసేవరకు ఆగలేకపోతున్నా
చిరంజీవి తాజా చిత్రం 'సైరా' అక్టోబర్ 2న విడుదలకాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజగా ఈ ట్రైలర్ పై బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పందించారు. ''సైరా' ట్రైలర్ చూశా. అద్భుతంగా ఉంది. చిరంజీవి గారికి పెద్ద అభిమాని అయిన నేను... ఈ సినిమా చూసేవరకు ఆగలేకపోతున్నా. చిరంజీవి సార్, రామ్ చరణ్, మొత్తం టీమ్ కు ఆల్ ది బెస్ట్' అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
Go Back to Shorts
Chiranjeevi
Sye Raa Narasimha Reddy
tollywood
Aamir Khan
Bollywood

More Telugu News