మన ‘విక్రమ్’డు ఏమయ్యాడో?...నాసా ఫొటోల్లోనూ దొరకని ఆచూకీ!
- ల్యాండర్ దిగిన చోట ఫొటోలు సేకరించిన నాసా
- ఇంకా విక్రమ్‌పై స్పష్టత రాలేదని ప్రకటన
- నీడ భాగంలోగాని, దూరంగా గాని ఉండవచ్చునని అనుమానం
‘ఫొటోలు తీసే సమయానికి ల్యాండర్ నీడలో ఉండడంగాని, నిర్దిష్ట ప్రాంతానికి ఆవలగాని ఉన్నట్టయితే ఫొటోల్లో కనిపించక పోవడం విశేషం ఏమీ కాదు, పాత ఫొటోలతో వాటిని పోల్చిచూస్తేగాని వాస్తవం తెలియదు’ అని నాసా ఎల్ఆర్ఓ డిప్యూటీ ప్రాజెక్టు సైంటిస్ట్ జాన్‌కెల్లర్ తెలిపారు. తమ ఆర్బిటర్ చంద్రుని ఉపరితలానికి అతి దగ్గర నుంచి ఫొటోలు తీయడం వల్ల నీడ ఎక్కువగా పడిందని నాసా తెలిపింది. కాగా, విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఇస్రో ప్రకటించింది.