Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రముఖ శృంగార తార జెస్సికా జేమ్స్ ఆకస్మిక మృతి

  • శాన్ ఫెర్నాండో వ్యాలీలోని నివాసంలో  మృతి
  • జెస్సికా వయసు 43 ఏళ్లు
  • శృంగార కథానాయికగా మారక ముందు ఉపాధ్యాయురాలిగా పని చేసిన జెస్సికా
హాలీవుడ్ కు చెందిన ప్రముఖ శృంగార తార జెస్సికా జేమ్స్ హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 43 సంవత్సరాలు. అమెరికాలోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో ఆమె మరణించారు. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు ఒకరు వెల్లడించారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని... పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఒక మీడియా కథనం ప్రకారం జెస్సికా జేమ్స్ నుంచి కొన్ని గంటలుగా ఎలాంటి ఫోన్ కాల్స్ రాకపోవడంతో... ఆమె స్నేహితులు ఆమె నివాసానికి వెళ్లారు. అప్పటికే ఆమె అచేతనంగా పడి ఉన్నారు. వెంటనే ఆమె స్నేహితుడు పోలీసులకు సమాచారాన్ని అందించాడు. గత కొన్నేళ్లుగా మూర్ఛ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆమె నివాసంలో అనేక మందులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శృంగార కథానాయికగా మారక ముందు ఆమె ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఐదు, ఆరు తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. 
Jessica James
Hollywood
Dead

More Telugu News