ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి రూ. లక్ష బోనస్.. దసరా కానుక ప్రకటించిన కేసీఆర్

  • సింగరేణి లాభాల్లో 28 శాతాన్ని కార్మికులకు బోనస్ గా ప్రకటించిన సీఎం
  • ప్రతి కార్మికుడికి బోనస్ గా రూ. 1,00,899
  • 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,565 కోట్ల లాభాన్ని ఆర్జించిన సింగరేణి
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. దసరా పండుగ సందర్భంగా భారీ కానుకను ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 28 శాతాన్ని కార్మికులకు బోనస్ గా అందజేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి కార్మికుడికి రూ. 1,00,899 బోనస్ చెల్లిస్తామని చెప్పారు. గత ఏడాది బోనస్ కంటే ఇది రూ. 40,530 ఎక్కువ కావడం గమనార్హం.

అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా సింగరేణి లాభాలు పెరుగుతున్నాయని చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,565 కోట్ల లాభాన్ని ఆర్జించిందని తెలిపారు. ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు, లాభాలు, టర్నోవర్ లో సింగరేణి ప్రగతిపథంలో దూసుకుపోతోందని... సింగరేణి ప్రగతి రాష్ట్ర ప్రభుత్వ దక్షతకు ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు.
Go Back to Shorts
Singareni
Employees
Bonus
KCR
TRS

More Telugu News