టీటీడీ పాలకమండలి: కర్ణాటక కోటాలో పారిశ్రామికవేత్తలకే అందలం
- సామాజిక సేవల కోటాలో సుధామూర్తికి స్థానం
- పారిశ్రామికవేత్తల కోటాలో రమేశ్ శెట్టి, సంపత్ రవినారాయణలు
- ఈసారి ఏపీ కోటా నుంచి డీపీ అనంత్
ఐదుకుపైగా కంపెనీల్లో చైర్మన్, డైరెక్టర్ హోదాల్లో సేవలు అందిస్తున్న సంపత్ రవినారాయణ గతంలోనూ టీటీడీ బోర్డు సభ్యుడిగా సేవలు అందించారు. స్టీల్ స్ట్రాంగ్ పేరిట రమేశ్ శెట్టి వంద కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సిఫారసుతో ఆయనకు టీటీడీ బోర్డులో స్థానం లభించినట్టు సమాచారం.