'జాతీయ భాషగా హిందీ' వివాదం.. బలవంతంగా రుద్దకూడదని రజనీకాంత్ హితవు!
- దక్షిణాది రాష్ట్రాలు హిందీని అంగీకరించవు
- ఉత్తరాదిలోనే ఏకాభిప్రాయం దొరకదు
- చెన్నైలో మీడియాతో సూపర్ స్టార్
చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ భాషను కూడా బలవంతంగా రుద్దకూడదు. దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అంగీకరించవు. అంతవరకూ ఎందుకు? ఉత్తరాదిలోనే ఒకే భాష విషయంలో ఏకాభిప్రాయం దొరకదు. దేశాభివృద్ధికి ఒకే భాష మంచిదే. కానీ దురదృష్టవశాత్తూ భారత్ లో అది సాధ్యపడదు’ అని కుండబద్దలు కొట్టారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి షాలను రజనీకాంత్ కృష్ణార్జునులుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే.