అగ్రకుల అమ్మాయిని ప్రేమించాడని.. దళిత యువకుడి సజీవ దహనం.. కొడుకు మృతితో ప్రాణాలు విడిచిన తల్లి
- ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లాలో ఘటన
- ప్రియురాలిని కలిసి వస్తుండగా అడ్డుకున్న స్థానికులు
- చితకబాది నిప్పు పెట్టిన వైనం
శనివారం రాత్రి ప్రియురాలిని కలిసి వస్తుండగా అడ్డుకున్న కొందరు గ్రామస్థులు అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం ఇంట్లో పడేసి నిప్పు అంటించారు. గుర్తించిన స్థానికులు కొందరు మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక అతడి తల్లి ఏడుస్తూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.