వంద రోజులు కాదు వందేళ్లు పాలించినా మాకు వాళ్లు మంచి సర్టిఫికెట్స్ ఇస్తారా?: అంబటి రాంబాబు
- జనసేన పార్టీ మేనిఫెస్టో 22 పేజీలు ఉన్నాయి
- మా 100 రోజుల పాలనపై 33 పేజీల్లో విమర్శలు చేశారు!
- చంద్రబాబు చేసిన విమర్శలే పవన్ కూడా చేశారు!
జగన్ వందరోజుల పాలనను విమర్శిస్తూ చంద్రబాబు, పవన్ విడుదల చేసిన పుస్తకాల గురించి అంబటి ప్రస్తావిస్తూ, ఈ విమర్శలను చూస్తుంటే.. వీళ్లిద్దరూ కలిసి కూర్చుని ఇలా రాసుకున్నారా? లేక చంద్రబాబు ముందు బెంచ్ లో కూర్చుని రాస్తుంటే ఆయన వెనుక బెంచ్ లో కూర్చుని పవన్ కాపీ కొట్టాడా? అంటూ సెటైర్లు విసిరారు. ‘వీళ్లేమన్నా మాకు మంచి సర్టిఫికెట్లు ఇస్తారా? వందరోజులు కాదు వందేళ్లు మేము పరిపాలన చేసినా వాళ్లు మంచి సర్టిఫికెట్లు ఇస్తారని మేము ఆశించలేదు’ అని అన్నారు.