‘ఇంట్లో ఎవ్వరూ లేరు, వెంటనే వచ్చేయ్’ అంటూ ప్రియురాలి సందేశం.. ఆనందంతో వెళ్లి అడ్డంగా బుక్కైన యువకుడు!
- ఒడిశాలోని బాలాసోర్ లో ఘటన
- ఫేస్ బుక్ ద్వారా మొదలైన ప్రేమ
- అమ్మాయి ఇంటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన యువకుడు
ఈ క్రమంలో ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. అయితే తన తల్లిదండ్రులు బయటకు వెళ్లడంతో సదరు యువతి బైకుంఠకు ఫోన్ చేసింది. ‘ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లారు. నువ్వు ఇంటికి రా’ అంటూ సందేశం పెట్టింది. దీంతో బైకుంఠ పట్టలేని సంతోషంతో బైక్ పై అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. అయితే యువకుడి రాకను గమనించిన పొరుగింటి వ్యక్తి ఒకరు అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ కొట్టారు. దీంతో వీరిద్దరిని యువతి కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
ఈ సందర్భంగా అమ్మాయి కుటుంబం ఊరిముందు పంచాయితీ పెట్టింది. దీంతో బైకుంఠ యువతిని పెళ్లి చేసుకోవాల్సిందేనని గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ప్రేమ పేరుతో టైంపాస్ చేస్తానంటే తామూ ఒప్పుకోబోమనీ, నిజంగా తమ కుమార్తెను ప్రేమిస్తే వెంటనే పెళ్లి చేసుకోవాలని యువతి కుటుంబసభ్యులు కూడా స్పష్టం చేశారు. దీంతో బైకుంఠ చివరికి తన ప్రియురాలిని వివాహం చేసుకోవడంతో ఈ వివాదానికి శుభం కార్డు పడింది.