చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు
- నరసింహారెడ్డి గురించి మా నుంచి తెలుసుకున్నారు
- అప్పట్లో మాకు న్యాయం చేస్తామని చిరంజీవి హామీ ఇచ్చారు
- ఇంత వరకు న్యాయం చేయలేదు
సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన సమాచారాన్ని తమ నుంచి తీసుకున్నారని... షూటింగ్ కు అవసరమైన లొకేషన్స్, నరసింహారెడ్డి జీవితం గురించి తెలుకున్నారని ఈ సందర్భంగా వారు చెప్పారు. తమకు న్యాయం చేస్తామని ఆ సమయంలో చిరంజీవి హామీ ఇచ్చారని, కానీ, ఇంతవరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు వెళ్లి, వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.