సాహో రెండు వారాల కలెక్షన్స్ ఇవిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాహో రెండు వారాల కలెక్షన్స్ ఇవిగో!

  • ఆగస్టు 30న రిలీజైన సాహో
  • తొలిరోజే రూ.130 కోట్ల గ్రాస్
  • రెండు వారాల్లో రూ.424 కోట్లకు పైగా వసూలు
దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం కలెక్షన్లపరంగానూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రోజే రూ.130 కోట్ల గ్రాస్ తో బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు వారాలు కంప్లీట్ అయినా భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తాజాగా సాహో కలెక్షన్స్ రిపోర్టును యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ లో రిలీజ్ చేసింది. వరల్డ్ వైడ్ రెండు వారాల్లో రూ.424 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. హద్దుల్లేని విధ్వంసం నుంచి తిరుగులేని ప్రభంజనం వరకు అంటూ ఈ ట్వీట్ కు క్యాప్షన్ పెట్టారు.

బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం కావడంతో సాహోపై భారీ హైప్ ఏర్పడింది. ఇతర భాషల మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఇందులో పరభాషా నటీనటులకు స్థానం కల్పించారు. హీరోయిన్ గా శ్రద్ధా కపూర్, ఇతర పాత్రల్లో జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ కపూర్ వంటి నటులను తీసుకున్నారు. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మొదట్లో మిక్స్ డ్ టాక్ సంపాదించుకున్నా, వీకెండ్ తర్వాత సాలిడ్ గా రన్ అవుతోంది. సాహో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే.
Saaho
Collections
Box Office
Tollywood

More Telugu News