ఉగ్రవాద సంస్థలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం: పాక్ మంత్రి ఇజాజ్ షా
- జమాత్ ఉద్ దవా లాంటి సంస్థలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం
- వాటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంది
- పాక్ జాతీయ టీవీలో ఇజాజ్ షా సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ లో ఇజాజ్ కు బలమైన నేతగా గుర్తింపు ఉంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు మిలిటరీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్మీలో ఆయన బ్రిగేడియర్ గా పని చేశారు. అయితే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. పాక్ చెబుతున్న మాటలను అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదని, భారత్ నే నమ్ముతోందని కూడా ఆయన ఇటీవల అన్నారు.