వైజాగ్ లో ఒక్కడు... 130 బైకులు దొంగిలించాడు... హీరో హోండా వాహనాలే టార్గెట్!
- విశాఖలో 2013 నుంచి జోరుగా బైకు దొంగతనాలు
- పోలీసులకు సవాల్ గా మారిన వైనం
- ఎట్టకేలకు మిస్టరీ ఛేదించిన పోలీసులు
వీరయ్య చౌదరి అనే వ్యక్తి ఏకంగా 130 బైకులను దొంగిలించినట్టు పోలీసుల విచారణలో తేలింది. 2013 నుంచి బైకుల దొంగతనాలే లక్ష్యంగా పెట్టుకున్న వీరయ్య విశాఖ నగరంలోనూ, చుట్టు పక్కల గ్రామాల్లోనూ నిలిపి ఉంచిన బైకులను ఎత్తుకెళ్లేవాడు. అయితే పక్కాగా వలపన్నిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, చోరీకి గురైన బైకులను రికవరీ చేసిన పోలీసులు వాటిని ఓ మైదానంలో ప్రదర్శనకు పెట్టాల్సి వచ్చింది.