'భీష్మ'కి హైలైట్ గా నిలవనున్న కామెడీ
- నితిన్ కథానాయకుడిగా 'భీష్మ'
- కీలకమైన పాత్రలో హెబ్బా పటేల్
- క్రిస్మస్ కి భారీస్థాయి విడుదల
వెన్నెల కిషోర్ .. నితిన్ మధ్య నడిచే ఈ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా కామెడీ ట్రాక్ నిలుస్తుందని చెబుతున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ ను మళ్లీ గాడిలో పెడుతుందనే ఆశతో హెబ్బా పటేల్ వుంది.