తెలంగాణలో రెండు మేకలకు రూ.1,000 జరిమానా విధించిన పోలీసులు!
- కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ఘటన
- హరితహారం మొక్కలను మేసిన మేకలు
- పోలీసులకు అప్పగించిన ఎన్జీవో సభ్యులు
అలాగే తెలంగాణ ప్రభుత్వం ‘హరిత హారం’ పథకం కింద నాటిన మొక్కలను కూడా ఈ మేకలు తినేశాయి. ఈ నేపథ్యంలో మొక్కలను తినేస్తున్న రెండు మేకలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎన్జీవో సభ్యులు పోలీస్ అధికారులకు అప్పగించారు. దీంతో తన మేకలు కనిపించకపోవడంతో వాటి యజమాని రాజయ్య స్టేషన్ కు రాగా, పోలీసులు రూ.వెయ్యి జరిమానా విధించారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆ మొత్తం జరిమానా కట్టిన సదరు యజమాని, తన మేకలను తోలుకుపోయాడు.