Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారు లడ్డూకు రికార్డు ధర.. రూ.7.56 లక్షలకు దక్కించుకున్న భోలక్‌పూర్ భక్తుడు

  • దక్కించుకునేందుకు భక్తుల పోటీ
  • 123 గ్రాముల బంగారంతో లడ్డూ తయారీ
  • దక్కించుకున్న స్థానిక చేపల వ్యాపారి
హైదరాబాద్‌లోని భోలక్‌పూర్ డివిజన్‌లో వినాయకుడి బంగారు లడ్డూ ప్రసాదానికి రికార్డు స్థాయి ధర పలికింది. అయితే, గతేడాదితో పోలిస్తే ఇది తక్కువ ధరే అయినప్పటికీ దక్కించుకునేందుకు మాత్రం భక్తులు పోటీపడ్డారు. శ్రీ సిద్ధి వినాయక భగత్‌సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ప్రసాదంగా సాధారణ లడ్డూతో పాటు బంగారు లడ్డూను కూడా పెడుతూ వస్తున్నారు. ఈసారి రూ.5 లక్షల విలువైన 123 గ్రాముల బంగారంతో లడ్డూను తయారుచేసి ఉంచారు. నిన్న ఈ లడ్డూకు వేలం పాట నిర్వహించగా దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. చివరికి స్థానిక చేపల వ్యాపారి బైరు విష్ణుప్రసాద్ రూ.7.56 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది 120 గ్రాముల బంగారంతో లడ్డూను తయారుచేయగా స్థానికంగా నివసించే కె.భాస్కర్ అనే వ్యక్తి రూ.8.1 లక్షలకు దక్కించుకున్నారు.
golden laddu
bholakpur
Hyderabad

More Telugu News