Andhra Pradesh: తన ఇమేజ్ దెబ్బతింటుందని జగన్ తీవ్రంగా భయపడుతున్నారు!: కింజరాపు రామ్మోహన్ నాయుడు

  • టీడీపీ ఆందోళనల్ని అణచివేస్తున్నారు
  • ప్రతిపక్ష నేతలపై పోలీసుల్ని ప్రయోగిస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
తెలుగుదేశం చేపట్టిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి అనుమతి లేదని ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్, ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరును తెలుగుదేశం నేత, లోక్ సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్రంగా తప్పుపట్టారు.

వైసీపీ నేతలు చేస్తున్న అకృత్యాలు బయటకు వస్తాయన్న భయంతోనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయని ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే పోలీసులను ప్రయోగించి తమ ఆందోళనను అణచివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Telugudesam
Rammohan naidu
Twitter
Chalo atmakur

More Telugu News