చంద్రబాబు హౌస్ అరెస్టుపై వివరణ ఇచ్చిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఈరోజు ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పిలుపునిచ్చిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఉండవల్లిలోని నివాసంలో బాబును నిర్బంధించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబును తాము హౌస్ అరెస్ట్ చేయలేదని సవాంగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు పల్నాడుకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని తెలిపారు. అందుకే టీడీపీ అధినేతను ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Telugudesam
House arrest
DGP
Gautam sawang

More Telugu News