Andhra Pradesh: 144 సెక్షన్ విధించాం కాబట్టి ఇంటి నుంచి బయటకు రావొద్దు!: చంద్రబాబుకు పోలీసుల సూచన

  • ఇంటి గోడకు అంటించిన పోలీస్ అధికారులు
  • నేడు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన బాబు
  • ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్న పోలీసులు
తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఈరోజు పోలీసులు ఉండవల్లిలో హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పల్నాడులో ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటి ప్రధాన ద్వారానికి తాడు కట్టేసిన పోలీసులు, వాహనాలు బయటకు వెళ్లకుండా భారీగా మోహరించారు.

ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పోలీసులు నోటీసులు అంటించారు. ఉండవల్లి ప్రాంతంలో 144 సెక్షన్ విధించామని పోలీసులు తెలిపారు. అందువల్లే ఇంటి నుంచి బయటకు రావొద్దని నోటీసులో స్పష్టం చేశారు. అంతకుముందు మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ చేపట్టి తీరుతామని ప్రకటించారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Undavalli house
Notices

More Telugu News