సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- గ్లామరస్ భామకు ప్రత్యేక ఆఫర్లు
- రాజమౌళి కోసం 'సైరా' స్పెషల్ షో
- 'ఆర్.ఆర్.ఆర్'పై విజయశాంతి వివరణ
* చిరంజీవి కథానాయకుడుగా నటించిన భారీ చిత్రం 'సైరా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో త్వరలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి కోసం ఈ చిత్రం ప్రత్యేక షోను ఏర్పాటు చేస్తున్నారట. రాజమౌళి నుంచి దర్శక నిర్మాతలు సలహాలు, సూచనలు తీసుకునే క్రమంలోనే ఈ షోను ముందుగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
* దాదాపు పదమూడేళ్ల విరామం అనంతరం ప్రముఖ నటి విజయశాంతి మహేశ్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే. ఇదే క్రమంలో రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో వాస్తవం లేదని, ఈ చిత్రంలో తాను నటించడం లేదని విజయశాంతి తాజాగా వివరణ ఇచ్చారు.