పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్
- ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతిలేదన్న డీజీపీ
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచన
- పార్టీలు సహకరించాలంటూ విజ్ఞప్తి
ప్రజలు వినాయక చవితి, మొహర్రం వంటి పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు. పల్నాడు ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.