బెంగళూరులో బార్ లపై పోలీసుల దాడి.. రెస్క్యూ హోమ్స్ కి 100 మంది డ్యాన్సర్ల తరలింపు!
- బార్లలో బలవంతంగా నృత్యాలు
- మూడు బార్లపై పోలీసుల దాడి
- పరారీలో ఉన్న యజమానులు
అశోకనగరలోని రెసిడెన్సీరోడ్డులో ఉన్న పేజ్ 3 బార్, కబ్బన్పార్కు సమీపంలోని డయట్ బార్, టైమ్స్ బార్ పై దాడులు చేశామని, పట్టుబడిన అమ్మాయిలు డ్యాన్సర్లుగా, సప్లయర్లుగా ఉన్నారని, అక్కడి కస్టమర్లను పంపించి వేశామని, పరారీలో ఉన్న యజమానులు సంతోష్, రాజు, పాయల్, మహేశ్ తదితరుల కోసం గాలిస్తున్నామని డీసీపీ చేతన్ సింగ్ వెల్లడించారు. ఈ బార్లలో ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆయన తెలిపారు.