Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'దేని దారి దానిదే' అంటున్న మెహ్రీన్  
  • డా.రాజశేఖర్ తాజా చిత్రం అప్ డేట్ 
  • మణిరత్నం చిత్రానికి మరొక టెక్నీషియన్
*  తాను కష్టంతో పాటు విధిని కూడా బాగా నమ్ముతానని అంటోంది కథానాయిక మెహ్రీన్. 'చిన్నప్పుడు ఎక్కువగా ప్రాక్టికల్ గానే ఉండేదానిని. అయితే, తర్వాత కాలంలో అనుకోకుండా నేను ఆర్టిస్టుని కావడం.. ఈ సక్సెస్.. ఇవన్నీ చూశాక కచ్చితంగా విధిని కూడా నమ్మడం మొదలుపెట్టాను. మనకి ఎలా రాసి వుంటే అలా జరుగుతుందన్న విషయాన్ని బలంగా నమ్ముతున్నాను. అలాగని కష్టపడకుండా మాత్రం ఉండను. దేని దారి దానిదే' అని చెప్పింది.
*  ప్రముఖ నటుడు డా.రాజశేఖర్ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించే ఈ థ్రిల్లర్ షూటింగును హైదరాబాద్, చెన్నైలలో నిర్వహిస్తారు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించే 'పొన్నియన్ సెల్వన్' భారీ చారిత్రాత్మక చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చుతుండగా, తాజాగా ఆర్ట్ డైరెక్టర్ గా తోట తరణిని తీసుకున్నట్టు సమాచారం. గతంలో మణిరత్నం, తరణి కలసి 'నాయకన్', 'దళపతి' చిత్రాలకు పనిచేశారు.  
Mehrin
Dr Rajashekhar
Maniratnam
A.R Rehman

More Telugu News