చైనా కీలక నిర్ణయం.. పాకిస్థాన్ లో బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయం

  • పాక్ సంక్షేమ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడుతున్నామని ప్రకటించిన చైనా రాయబారి
  • సంతృప్తికరంగా ఉన్న చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ 
  • చైనాలో పాక్ మహిళా వ్యాపారవేత్తలకు వర్క్ షాప్
ఉగ్రవాదాన్ని నియంత్రించాలంటూ ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఒక రకంగా చెప్పాలంటే పాకిస్థాన్ ఏకాకిగా మిగిలిపోయింది. తన వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని చైనా మాత్రమే పాకిస్థాన్ కు అండగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సంక్షేమ ప్రాజెక్టుల్లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో, మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని చైనా రాయబారి యవో జింగ్ తెలిపారు. పాక్ లో ఉన్న వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పాక్ మహిళా వ్యాపారవేత్తలకు చైనాలో వర్క్ షాప్ లను నిర్వహించబోతున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
China
Pakistan
CPEC
Investment

More Telugu News