బిగ్‌బాస్-3: నామినేట్ అయిన తొలిసారే అలీ రెజా ఔట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్-3: నామినేట్ అయిన తొలిసారే అలీ రెజా ఔట్

  • శ్రీముఖి, రాహుల్, మహేశ్ విట్టా, రవికృష్ణ సేఫ్
  • ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు
  • కొంప ముంచిన దూకుడు
ఈ వారం బిగ్‌బాస్-3 హౌస్ నుంచి నటుడు అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. షో ప్రారంభమై ఇది ఆరోవారం కాగా, తొలిసారి నామినేట్ అయిన అలీ రెజా ఎలిమినేట్ కావడం గమనార్హం. ఈ వారం శ్రీముఖి, అలీరెజా, రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టా, రవికృష్ణలు నామినేట్ కాగా, ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు రావడంతో అలీ నామినేట్ అయినట్టు వ్యాఖ్యాత నాగార్జున తెలిపాడు.

టాస్క్‌ల పరంగా అలీ బాగానే ఆడుతున్నా దూకుడే అతడిని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. తప్పు చేసినా వితండవాదం చేయడం, ఇంటి సభ్యులతో దూకుడుగా ప్రవర్తించడం వల్ల ప్రేక్షకుల్లో అతడిపై వ్యతిరేక భావన వచ్చిందని చెబుతున్నారు. ఈ కారణంగా అతడికి అతి తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు.
bigboss
Nagarjuna
star maa tv

More Telugu News