Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో నాని.. వైసీపీ నేత చెవిరెడ్డిపై పొగడ్తలు!

  • ‘గ్యాంగ్ లీడర్’ యూనిట్ తో కలిసి దర్శనం
  • తిరుమలకు వస్తే పాటిజివ్ ఫీలింగ్ వచ్చేస్తుందన్న నాని
  • ఈ నెల 13న రిలీజ్ కానున్న ‘గ్యాంగ్ లీడర్’
నేచురల్ స్టార్ నాని ఈరోజు ‘గ్యాంగ్ లీడర్’ సినిమా యూనిట్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆయన వెంట వైసీపీ నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలను దర్శించుకుంటే ఓ తెలియని పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుందని నాని  తెలిపాడు. స్వామివారిని దర్శించుకోవాలనీ ఎప్పుడో అనుకున్నాననీ, అయితే షూటింగ్ కారణంగా ఆలస్యమైందని చెప్పాడు.

అయితే లక్కీగా ఈసారి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా విడుదలకు ముందే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలిగామని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై హీరో నాని ప్రశంసలు కురిపించాడు. ఈరోజు చెవిరెడ్డి కారణంగా స్వామివారి దర్శనం తనకు బాగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇందుకు చెవిరెడ్డికి నాని థ్యాంక్స్ చెప్పాడు. తాము ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో తిరిగివెళుతున్నట్లు నాని తెలిపాడు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించాడు.
Tollywood
Andhra Pradesh
Tirumala
Tirupati

More Telugu News