గృహహింస కేసులో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీమిండియా క్రికెటర్ షమీ

  • షమీపై గృహహింస కేసు పెట్టిన భార్య హసీన్ జహాన్
  • విండీస్ టూర్ ముగియగానే భారత్ రాకుండా అమెరికా వెళ్లిన షమీ
  • సెప్టెంబరు 12న స్వదేశానికి వచ్చే అవకాశం
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై భార్య హసీన్ జహాన్ గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కోల్ కతా అలిపూర్ కోర్టు షమీపై వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం షమీ అమెరికాలో ఉన్నాడు. విండీస్ టూర్ ముగిసిన తర్వాత షమీ స్వదేశానికి రాకుండా అమెరికా వెళ్లిపోయాడు. సెప్టెంబరు 12న అతను భారత్ కు తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో, తన న్యాయవాది సలీం రెహ్మాన్ తో సంప్రదింపులు జరిపాడు. త్వరలోనే దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడాల్సి ఉన్నందున ఆ లోపు తనకు న్యాయపరమైన సమస్యలు లేకుండా చూడాలని తన న్యాయవాదిని కోరినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Shami
Hasin Zahan
Cricket

More Telugu News