కంటతడి పెట్టిన ఇస్రో ఛైర్మన్.. గాఢంగా హత్తుకుని ఓదార్చిన మోదీ.. వీడియో చూడండి!

  • చివరి నిమిషంలో విఫలమైన చంద్రయాన్-2
  • మోదీ వద్దకు వెళ్లి కంటతడి పెట్టిన ఇస్రో ఛైర్మన్
  • శివన్ వీపును నిమురుతూ ధైర్యం చెప్పిన మోదీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో విఫలమైన సంగతి తెలిసిందే. చంద్రయాన్-2 విఫలం కావడంతో బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో మౌనం రాజ్యమేలింది. ప్రధాని మోదీతో సహా, ఇస్రో ఛైర్మన్, శాస్త్రవేత్తలు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

అనంతరం మోదీ ప్రసంగించిన తర్వాత ఆయన వద్దకు వెళ్లిన ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా శివన్ ను మోదీ దగ్గరకు తీసుకుని, గాఢంగా హత్తుకున్నారు. తన భుజంపై శివన్ తల ఉంచుకుని, ఆయన వీపును నిమురుతూ, ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఇస్రో సాధించబోయే ఘన విజయాలకు ఇది బలమైన నాంది పలుకుతుందని చెప్పారు. అంతకు ముందు మోదీ ప్రసంగిస్తూ, చంద్రుడిని తాకాలనే మన ఆకాంక్ష ఇప్పుడు మరింత బలపడిందని... రానున్న రోజుల్లో మనం ఘన విజయాలను సాధిస్తామని అన్నారు.
Go Back to Shorts
Modi
ISRO
Sivan
Hug
Chandrayaan 2

More Telugu News