పుట్టినరోజున జైల్లో గడపనున్న చిదంబరం

  • ఈ నెల 19 వరకు చిదంబరంకు జ్యుడీషియల్ కస్టడీ
  • తీహార్ జైల్లో గడుపుతున్న కేంద్ర మాజీ మంత్రి
  • 16న 74వ పుట్టినరోజును జరుపుకోనున్న చిదంబరం
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఆయనను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 19 వరకు ఆయన కస్టడీ కొనసాగనుంది. మరోవైపు ఈనెల 16న చిదంబరం తన 74వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఆ రోజు కూడా తోటి ఖైదీల మధ్య జైలు గోడల మధ్య చిదంబరం గడపనున్నారు. గత నెల 21న చిదంబరంను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Go Back to Shorts
Chidambaram
Tihar Jail
Congress
Birthday

More Telugu News