మీ ఇష్టం.. పాక్ వెళ్తే మాత్రం భారత్ రావొద్దు: చైనా విదేశాంగ మంత్రికి తెగేసి చెప్పిన భారత్
- పాక్లో పర్యటించి ఆపై భారత్లో పర్యటించనున్న చైనా విదేశాంగ మంత్రి
- పాక్ వెళ్లి ఆ వెంటనే భారత్ రావొద్దన్న భారత్
- అన్ని దేశాలకు ఇది వర్తిస్తుందని చెప్పిన భారత ప్రభుత్వం
రెండు దేశాల్లోనూ వెంట వెంటనే పర్యటించాలనుకుంటే తాము అంగీకరించబోమని, షెడ్యూలును మార్చుకోవాలని భారత్ స్పష్టం చేసింది. రెండు దేశాల్లోనూ ఒకేసారి పర్యటిస్తే అది రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నిబంధన ఒక్క చైనాకే కాకుండా ఇరు దేశాల్లో పర్యటించాలనుకున్న అన్ని దేశాలకు వర్తిస్తుందని భారత్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.