రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన మారుతి సుజుకి
- ఆటోమోబైల్స్ పరిశ్రమపై ఆర్థిక మందగమనం ప్రభావం
- ఉత్పత్తికి సరిపడా లేని డిమాండ్
- 7, 9 తేదీలను 'నో ప్రొడక్షన్ డే'గా ప్రకటించిన మారుతి
గత నెలలో మారుతి అమ్మకాలు 33.7 శాతం తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో 1,58,189 యూనిట్ల అమ్మకాలు జరగ్గా... ఈ ఆగస్టులో 1,06,413 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఎగుమతులు సైతం ఆగస్టులో 10.8 శాతం పడిపోయాయని మారుతి సుజుకి తెలిపింది.