Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ‘లింపోమా’ ఆపరేషన్!

  • వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుజరాత్ కు వచ్చిన అమిత్ షా 
  • అహ్మదాబాద్ లోని కేడీ ఆసుపత్రిలో చేరిక 
  • మైనర్ సర్జరీ నిర్వహించిన వైద్యులు
కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు ఈ రోజు గుజరాత్, అహ్మదాబాద్ లోని కేడీ ఆసుపత్రిలో మెడ వెనుక భాగంలో లింపోమా(చిన్న గడ్డ)కు మైనర్ సర్జరీ నిర్వహించారు. లోకల్ అనెస్థీషియా ఇచ్చి, ఈ ఆపరేషన్ ను వైద్యులు పూర్తి చేశారు. అనంతరం షాను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన అహ్మదాబాద్ లోని తన ఇంటికి వెళ్లిపోయారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నిన్న అమిత్ షా అహ్మదాబాద్ కు రావడం జరిగింది. 
Amit Shah
Gujarat
ahmadabad
Limfoma
Minor surgery
Home minister
BJP
Discharged

More Telugu News