Chiranjeevi: 'సైరా' నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ వచ్చేస్తోంది

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'సైరా' చిత్రం కోసం మెగా అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

వచ్చేవారం ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను వదలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. తేదీ ఎప్పుడనేది రేపో .. ఎల్లుండో ప్రకటించనున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, తమన్నా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Nayanatara
Thamannah

More Telugu News