Irfan Pathan: బుమ్రా అరుదైన ఘనతను సాధించినట్టే: ఇర్ఫాన్ పఠాన్

  • టీమిండియాలో బుమ్రా కీలకమైన ఆటగాడు
  • అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడు
  • హ్యాట్రిక్ సాధించడం గొప్ప అనుభూతి
టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాపై సీనియర్ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత జట్టులో బుమ్రా అత్యంత కీలకమైన ఆటగాడని కితిబిచ్చాడు. బుమ్రా ఆడకపోతే అది పెద్ద లోటుగా మారుతుందని అన్నారు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న బుమ్రా టీమిండియాకు వరమని చెప్పాడు. 2006లో పాకిస్థాన్ పై తాను హ్యాట్రిక్ సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ... హ్యాట్రిక్ సాధించడం గొప్ప అనుభూతిని ఇస్తుందని అన్నాడు.

అందరూ ఆ ఘనతను అందుకోలేరని... విండీస్ పై హ్యాట్రిక్ సాధించిన బుమ్రా ఆ ఘనతను సాధించినట్టేనని చెప్పాడు. బుమ్రాకు ఇది చివరి హ్యాట్రిక్ కాదని.. మరిన్ని హ్యాట్రిక్ లు సాధిస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. భారత్ తరపున టెస్టుల్లో ఇప్పటి వరకు ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, బుమ్రాలు హ్యాట్రిక్ సాధించారు.
Irfan Pathan
Bumrah
Team India

More Telugu News