ఫన్ జోనర్లో బెల్లంకొండ మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫన్ జోనర్లో బెల్లంకొండ మూవీ

  • 'రాక్షసుడు'తో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ 
  • దర్శకుడు త్రినాథరావు నక్కినకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలో మిగతా వివరాలు 
బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవల చేసిన 'రాక్షసుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత ఆయన చేసే సినిమా గురించిన సమాచారం ఒకటి తాజాగా బయటికి వచ్చింది. దర్శకుడు నక్కిన త్రినాథరావుతో బెల్లంకొండ తదుపరి సినిమా వుండనున్నట్టు తెలుస్తోంది.

త్రినాథరావు పేరు వినగానే 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' .. 'హలో గురు ప్రేమకోసమే' వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. యూత్ తో పాటు మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటూ ఈ సినిమాలు పూర్తిగా ఫన్ జోనర్లో కొనసాగాయి. అదే ఫన్ జోనర్లో బెల్లంకొండ సినిమా వుండనున్నట్టు సమాచారం. దిల్ రాజు గానీ .. బెక్కం వేణుగోపాల్ గాని ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Bellamkonda
Nakkina

More Telugu News