'వర్షం నచ్చని వ్యక్తి'గా విజయ్ ఆంటోని
- విజయ్ ఆంటోని హీరోగా కొత్త చిత్రం
- దర్శకుడిగా విజయ్ మిల్టన్
- కీలక పాత్రలో అల్లు శిరీష్
విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి 'మళై పిడిక్కాద మనిదన్'(వర్షం నచ్చని వ్యక్తి) టైటిల్ ను ఖరారు చేశారు. ఉత్కంఠభరితమైన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అల్లు శిరీష్ కనిపించనుండటం విశేషం. ఈ పాత్ర తనకి మంచి పేరు తెస్తుందని శిరీష్ చెప్పడం, కథలో కొత్తదనాన్ని చెప్పకనే చెబుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.