భారత్ ఎవ్వరినీ నిరాశ్రయులను చేయరాదు.. ఎన్నార్సీపై స్పందించిన ఐక్యరాజ్యసమితి!
- ఇటీవల ఎన్నార్సీని ప్రకటించిన కేంద్రం
- 19 లక్షల మంది భారతీయులు కాదని ప్రకటన
- వీరికి అన్నిరకాల సాయం అందించాలన్న ఐరాస
ఇలాంటి చర్యలు ప్రజలు నిరాశ్రయులు కాకుండా తాము చేస్తున్న ప్రయత్నాలకు గొడ్డలిపెట్టు లాంటివని ఐరాస పునరావాస హైకమిషనర్ ఫిలిప్పో గ్రాండీ తెలిపారు. విదేశీయులుగా ప్రకటించిన 19 లక్షల మందికి న్యాయ సహాయం, సమాచారం అందించాలని సూచించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన ఎన్నార్సీ జాబితాలో 3.11 కోట్ల అస్సాం వాసులను భారత పౌరులుగా గుర్తించింది. మిగిలిన 19 లక్షల మంది భారత పౌరులు కాదని ప్రకటించింది. వీరిలో పలువురు సైనికులు, ఐఏఎఫ్ పైలట్లు ఉన్నారు. కాగా, వీరిని దేశం నుంచి బహిష్కరించబోమని కేంద్రం తెలిపింది. దీంతో ఈ 19 లక్షల మంది ప్రజల భవితవ్యంపై నీలినీడలు అలముకున్నాయి.