రాజకీయాల్లోకి తెచ్చిన అయ్యన్నకే గంటా సున్నం పెట్టారు!: నిప్పులు చెరిగిన ఏపీ మంత్రి అవంతి
- గంటాను నేను అసలు మనిషిగానే గుర్తించను
- ఏదో అదృష్టం బాగుండి ఎమ్మెల్యేగా గెలిచారు
- విశాఖలో మీడియాతో ఏపీ టూరిజం మంత్రి
ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నట్లు భ్రమపడుతున్నారు. గంటా నాకు సున్నం పూయాలని చూశారు. నేను పూయించుకోలేదు. ఏదో అదృష్టం బాగుండి గంటా స్వల్ప మెజారిటీతో ఈ ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ మంచివాళ్లను మాత్రమే చేర్చుకుంటుంది. కబ్జాదారులను కాదు’ అంటూ అవంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు.