Andhra Pradesh: నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు.. ప్రశంసలు కురిపించిన టీడీపీ అధినేత చంద్రబాబు!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కల్యాణ్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీనటులుగా అశేష ప్రేక్షకాభిమానాన్ని పవన్ కల్యాణ్ సంపాదించారని చంద్రబాబు ప్రశంసించారు.

విశిష్ట వ్యక్తిత్వంతో ఆయన ప్రజల పక్షాన నిలిచి సేవలు అందిస్తున్నారని కితాబిచ్చారు. పవన్ కల్యాణ్ నిండు నూరేళ్లు, ఆనందారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, ఓ ఫొటోను పోస్ట్ చేశారు.
Andhra Pradesh
Telangana
Pawan Kalyan
Jana Sena
birthday
wishes
Chandrababu
Telugudesam
Twitter

More Telugu News