దేంట్లో అభివృద్ధి చేయకపోయినా మద్యం అమ్మకాల్లో మాత్రం తెలంగాణను నెంబర్ వన్ చేశారు: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్
- వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జలసాధన సభ
- హాజరైన టి-కాంగ్రెస్ నేతలు
- కేసీఆర్ పై ధ్వజమెత్తిన హస్తం వర్గీయులు
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఏడాదిలో నీళ్లు ఇవ్వకపోతే టీఆర్ఎస్ పతనం మొదలైనట్టేనని అన్నారు. మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానిస్తూ, తెలంగాణకు సోనియా గాంధీనే ఓనర్ అని వ్యాఖ్యానించారు. తమను కేసీఆర్ ఓడిస్తే, ప్రజలు కవితను ఓడించారని పేర్కొన్నారు.