పాక్ జర్నలిస్టుతో శశిథరూర్ గడిపింది నిజమే... సునంద కేసులో కీలక సాక్ష్యమిచ్చిన నళినీ సింగ్!
- దుబాయ్ లో మూడు రాత్రులు గడిపారు
- సునందే స్వయంగా చెప్పి ఏడ్చింది
- కోర్టుకు నళినీ సింగ్ వాంగ్మూలం
సునంద తనకు మూడు సంవత్సరాలుగా తెలుసునని, చనిపోవడానికి ఏడాది ముందు నుంచే తన వ్యక్తిగత విషయాలను పంచుకునేదని నళినీ సింగ్ వెల్లడించారు. దుబాయ్ లో మెహర్ తో తన భర్త గడిపి వచ్చారని ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. వారి మధ్య శృంగార సందేశాలు కూడా నడిచాయని చెప్పిన ఆమె ఏడ్చిందని వెల్లడించారు. కాగా, సునంద ఆత్మహత్య కేసులో థరూర్ ను ప్రాసిక్యూట్ చేయాలంటూ, ఢిల్లీ పోలీసులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.